TRINETHRAM NEWS

తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాలో అడవి శాఖ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

తెలంగాణ ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశానుసారం ఈరోజు వికారాబాద్ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో 300 మంది వివిధ పాఠశాలలవిద్యార్థులతో అటవీ అవగాహనకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా మొదటగా జిల్లా అటవీ శాఖఅధికారికార్యాలయం నుంచి అడవిలోకివిద్యార్థులతో నేచర్ వాక్ నిర్వహించడం జరిగింది. అడవిలో అధికారులు విద్యార్థులకు రకరకాల చెట్లను చూపిస్తూ వాటి వల్లఉండేఉపయోగాలు, చెట్ల పెంపకం, చెట్లు లేకపోవడం వల్ల జరిగే నష్టాలు, అడవుల సంరక్షణ మరియు చెట్లు పెంచే విధానాలు క్షుణ్ణంగా వివరించడం జరిగినది.పెరుగుతన్న జనాభా దృష్ట్యా భారత దేశం లో అడవుల సంరక్షణపై విద్యార్థులు, యువత దృష్టి కేంద్రీకరించాలని జిల్లా అటవీశాఖ అధికారి అన్నారు.
అలాగే విద్యార్థులతో అధికారులుముఖాముఖి నిర్వహించి వాళ్ళు ఏం తెలుసుకున్నారు అని అడిగి తెలుసుకోవడం, దీనికి విద్యార్థులు ఎంతో చురుగ్గా సమాధానాలు ఇవ్వడం జరిగింది. జిల్లా అటవీ క్షేత్రఅధికారి,మాట్లాడుతూ అనంతగిరి అడవుల యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను విద్యార్థులకు వివరిస్తూచెట్లపెంపకానికి మరియు అడవుల సంరక్షణకు వివిధసూచనలు,ఇవ్వడంజరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాధికారి శ్రీ జ్ఞానేశ్వర్ వికారాబాద్ అటవీ క్షేత్ర అధికారి శ్రీ కే శ్యామ్ కుమార్ ధారూర్ అటవీ క్షేత్ర అధికారి బిరాజేందర్ వివిధపాఠశాల అధ్యాపకులు మరియు అటవీ శాఖ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App