
రాజమహేంద్రవరం, తేదీ:10.02.2024
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లో రెండు రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం 16.07.2019 తేదీన విడుదల చేసిన “నోటిఫికేషన్ సం.01/2019″ కు సంబంధించి 25.04.2020 తేదీన నిర్వహించవలసిన వ్రాత పరీక్ష కోవిడ్-19 కారణంగా వాయిదా పడిన విషయాన్ని గతంలో పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడమైనదని, ఆ వ్రాత పరీక్షను 18.02.2024 తేదీన ఉ. 10:00 గం. నుండి 12:30 గం. వరకు గోకవరం బస్టాండ్ సమీపంలోని రాజమహేంద్రి మహిళల డిగ్రీ మరియు పి.జి. కళాశాల నందు నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి. గంధం సునీత శనివారం ఒక పత్రికా ప్రకటన తెలిపారు.
ఈ పరీక్ష కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్ధులకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా హాల్ టికెట్లను పంపించగా, దరఖాస్తులో తెలిపిన చిరునామాలో అభ్యర్ధులు లేకపోవడం మరియు ఇతర కారణాల వల్ల హాల్ టికెట్లు తిరిగి సంస్థకు వస్తున్నట్లు తెలిపారు. అలాంటి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి వారి హాల్ టికెట్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమండ్రి కార్యాలయమును సంప్రదించి పొందగలరని తెలియ చేసారు.
//జారీ చేయువారు// శ్రీమతి గంధం సునీత
ఛైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం,
