Trinethram News : Mar 22, 2024,
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం నాసిక్ రోడ్ స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్ చివర ఉన్న ఆఖరి బోగీల్లో మంటలు చెలరేగడంతో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్ నుంచి ఆ బోగీని వేరు చేశారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.