
తేదీ : 20/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం సమన్వయంతో కలిసి నడుస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. వెన్ను నొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయినని , ఇప్పటికే ఆ నొప్పి వేధిస్తుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గత ప్రభుత్వం వైసిపి హాయంలో రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారని ఆరోపించడం జరిగింది. అందువల్లే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అయినా హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని వివరించారు. ఒక డాబా కట్టినప్పుడు మెట్లు ఉంటాయి పైకి ఒకేసారి ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఎక్కాలి. అప్పుడు డాబా పైకి చేరుకుంటామని , అదేవిధంగా పథకాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తామని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
