TRINETHRAM NEWS

తేదీ : 30/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి శాంతి కుమారి అనే ఖైదీ బ్యారాక్ లో చున్నీతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆమెను చూసిన వెంటనే జైలు సిబ్బంది ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవకరించారు.

శాంతి కుమారి జీలుగుమిల్లి మండలం, తాటి ఆకులగూడెం. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఆరోపణలతో ఈనెల 24వ తేదీన అరెస్టు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Female prisoner commits suicide