TRINETHRAM NEWS

పుట్టినరోజు నాడే మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు

వీరిద్దరు కులాలు వేరు.. వేరు కావడంతో ప్రేమకు అడ్డు చెప్పిన యువతి తండ్రి.. ఇక నుంచి అమ్మాయితో మాట్లాడొద్దని సాయికుమార్‌ను హెచ్చరించిన యువతి తండ్రి

కానీ.. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉండటంతో.. ఆగ్రహంతో రగిలిపోయి, ఎలాగైనా ప్రియుడిని చంపాలని అనుకున్న అమ్మాయి తండ్రి

ఈ క్రమంలో గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి పది గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో కూర్చుని వారితో మాట్లాడుతుండగా.. ఈ సమయంలో అమ్మాయి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకున్నాడు

అనంతరం ఒక్కసారిగా గొడ్డలితో విచక్షణారహితంగా సాయి కుమార్‌పై దాడి చేయడంతో సాయికి తీవ్ర గాయాలయ్యాయి

అతని స్నేహితులు, కుటుంబసభ్యులు, సాయికుమార్‌ను హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వైద్యం అందిస్తుండగానే సాయికుమార్ మృతి చెందాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Father brutally hacked young