Trinethram News : సంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు ముత్తంగి జంక్షన్ వద్ద ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో DCMలోని ఇద్దరు కూలీలు మృతిచెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App