TRINETHRAM NEWS

రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుంది
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి మండలంలోని చీకురాయి, బొజన్నపేట మరియు హనుమంతునిపేట గ్రామాల్లో పర్యటించి ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను అధికారులతో మరియు స్థానిక నాయకులతో, రైతులతో కలిసి పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ అకాల వర్షం ద్వారా పెద్దపల్లి మండలంలోని బోజన్నపేట, చీకురాయి మరియు హనుమంతునిపేట గ్రామాల రైతుల వరి, మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని తక్షణమే నష్టపోయిన రైతుల పంట పొలాలతో పాటు మొక్కజొన్నను అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాటు వ్యవసాయ శాఖ కమిషనర్ రామ కృష్ణా రావు తో పాటు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు.

గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు రైతులు ఎప్పుడు నష్టపోయిన పట్టించుకున్న పాపాన పోలేదని ప్రస్తుతం తాము రైతుల పక్షాన నిలబడి వారిని నష్టపోకుండా కృషి చేస్తున్నామన్నారు. అలాగే రైతులందరూ చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకున్నామని ప్రతి రైతు గుంట భూమి కూడా ఎండిపోకుండా నీరు అందించేందుకు తాను కృషి చేస్తానని ఎట్టి పరిస్థితిలో రైతులు తూములు కాలువ గట్లను ధ్వంసం చేసి నీరును వృధా చేయవద్దని అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని తప్పకుండా ప్రతి రైతుకు నీరును అందించేందుకు సహకరిస్తానని అన్నారు
ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farmers who have lost