రైతులను నట్టేటా ముంచిన రెవంత్ రెడ్డి సర్కార్ తొలిసిఎం కేసీఆర్ పాలనలో రైతులు రాజులుగా బతికారు
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు కన్నీళ్లే మిగిలింది
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలు అమలు చేయకుండా ప్రజలను, రైతులను సిఎం రెవంత్ రెడ్డి మెాసం చేశారు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతుబంధు పధకం అమలు చేయకుండా రైతులను రెవంత్ రెడ్డి సర్కార్ నట్టేటా ముంచిందని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. రైతు భరోసాపై సబ్ కమిటీ వేశాం.. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా వేస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యలు నిరసనగా బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ పిలుపు మేరకు అదివారం అంతర్గాం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో సిఎం రెవంత్ రెడ్డి దిష్టి బోమ్మ ను బి.ఆర్.ఎస్ శ్రేణులు దహనం చేశారు. రైతు బంధు అమలు చేయాలని నినాదించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాటు బిఆర్ఎస్ నాయకులను పోలీసులు ఆరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ తొలి సిఎం కేసీఆర్ పాలన యావత్తు తెలంగాణ రైతాంగం రాజులుగా బతికరన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లు మిగిలాయాన్నారు
రైతు భరోసాపై సబ్ కమిటీ వేశాం.. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా వేస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యలు విడ్డురంగా ఉన్నయాన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమా చేశారని గుర్తు చేశారు. అబద్దపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ప్రజలను, అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామిలు నేరవెర్చదాకా పోరాడుతని రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ ఆములనారాయణ,
మాజీ వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ లు బండారి ప్రవీణ్, మేరుగు పోచం, దర్ని రాజేష్, సందేళ్ల మల్లయ్య, అర్షనపెల్లి శ్రీనివాస్, గంగాధరి రామన్న, కొలిపాక మధుకర్ రెడ్డి,కార్పొరేటర్ కలవచర్ల కృష్ణవేణి, నాయకులుబబొడ్డుపల్లి శ్రీనివాస్,నారాయణదాస్ మారుతీ,తోకల రమేష్,అర్షనపేల్లి రాజు, పోరండ్ల రాజి రెడ్డి,సట్టు శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి,కొల్లూరి సమరం,ఎండ్ అత్తారుద్దీన్, కాంపెల్లి సంతోష్, అవునూరి రాజేష్,కొంకటి సారయ్య,సారయ్య నాయక్, అర్షనపెల్లి శ్రీకాంత్,అవునూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App