TRINETHRAM NEWS

Farmer’s welfare is the priority of Congress government

రైతుల అభ్యున్నతి సింగిల్ విండో ల కృషి.

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి మండలం, అప్పన్నపేట గ్రామంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం 129 వ సర్వ సభ్య సమావేశం సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సోమవారం రోజున ముఖ్య అతిధిగా హాజరై పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామంలో ఆ ప్రాంత రైతుల అవసరాలకు అనుగుణంగా నూతనంగా నిర్మించిన గోదాంను తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ లిమిటెడ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు కలిసి ప్రారంభించిన
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పాలనలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిందని అన్నారు. రైతుల బాధలు పట్టించుకోలేదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ చేయని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని కనీసం రైతుల వడ్డీ మాఫీ చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం బావ బావమరుదులు రాష్ట్ర రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్ సభలో స్పష్టంగా హామీ ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.

రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపించామని కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడ రుణమాఫీ కానీ రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో ఎక్కడికైనా వచ్చి నిరూపించే దమ్ముందని పేర్కొన్నారు. కేవలం కల్లబొల్లి మాటలతో కాలం గడిపే వారి మాటలు నమ్మవద్దని పేర్కొన్నారు. రానున్న వర్షాకాలం పంటకు ₹500 రూపాయల బోనస్ ఇచ్చి తీరుతామని పేర్కొన్నారు. గతంలో రైతుల వద్ద వడ్లు కొనుగోలు చేసి అనేక ఇబ్బందులు పెట్టి కటింగ్ లు పెట్టిన చరిత్ర మీదని కమిషన్లకు కక్కుర్తి పడిన ప్రభుత్వం మీది అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్క కిలో కూడా కటింగ్ చేయకుండా రైతుల వడ్లు కొనుగోలు చేస్తున్నామని రైతులు కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన ఐదు రోజుల్లోనే తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని పేర్కొన్నారు.

రైతులను మోసం చేసే పార్టీ తమది కాదని రైతన్నలను రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రైతులు ఏ పంట పండించిన కొనుగోలు చేస్తామని సన్నరకం దొడ్డురకం అంటూ వంకలు పెట్టే ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. రైతు కూలీలకు సైతం రైతులకు అందించే విధంగానే నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12 వేల రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు. నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రతి సవాలు చేసిన వ్యక్తిని అని తాను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏ ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే సమాధానం చెప్పలేదని తాను ఉన్నదే రైతుల ప్రజల సేవ చేసేందుకుకనీ ఎమ్మెల్యే పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు చింతపండు సంపత్ మరియు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పీటీసి బండారు రామ్మూర్తి, సండవెన రాజేందర్, ఏద్దల్లి శంకర్, మార్కెట్ వైస్ చైర్మన్ మల్లారెడ్డి,మరియు తదితర గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farmer's welfare is the priority of Congress government