గోదావరిఖని లో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో ఫన్&జాయ్ ట్రేడ్ ఫేయిర్ 2025 ఎగ్జిబిషన్ ప్రారంభం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో
ఏర్పాటు చేసిన ఫన్&జాయ్ ట్రేడ్ ఫేయిర్ ఎగ్జిబిషన్ 2025 లండన్ సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే & కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు మానసిక ప్రశాంతత కొరకు, మనోఉల్లాసం కోసం సకుటుంబ సమేతంగా సందర్శించాలని కోరారు. ఈ సారి ఏర్పాటు చేసిన ప్రదర్శన పిల్లలు పెద్దలను, యువతను ఎంతగానే ఆకుట్టుకునే విధంగా ఉందని తెలియజేసారు. నిర్వాహకులు ఎండి అస్లాం మాట్లాడుతూ, ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు రామగుండం పారిశ్రామిక ప్రాంతములో మొట్టమొదటి సారిగా సందర్శకులు, యువత మనసు దోచుకునే విధంగా ఏర్పాటు చేసామని ఇందులో ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన లండన్ బ్రిడ్జి ముఖ ద్వారము, లండన్ స్ట్రీట్, ప్యాలేస్ సందర్శన యువతకు, సందర్శకులకు అద్భుతమైన మధురానుభూతి కల్గుతుందని, పిల్లలకు మరింత ఎక్సైట్మెంట్, పెద్దలను ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులు అందరికి సరదానుబూతి కల్గిస్తుందని మరియు మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి గృహోపకరణవస్తువులు, కళంకారి బెడ్ షీట్స్, హ్యాండి క్రాఫ్ట్, జ్యూవలరి ఐటమ్స్, హ్యాండ్ బాగ్స్ మొదలైన ఏన్నోరకాల వేరైటీలు ఇంకా కోలంబస్, జాయింట్ వీల్, క్రాస్ వీల్, బ్రెక్ డాన్స్, జంబోజేట్, డెవిల్ హౌజ్ మరియు చిన్న పిల్లల పార్క్ ఏర్పాటు చేసామన్నారు. ఈ ప్రదర్శన ఇప్పుటి నుండి 60రోజుల పాటు ఉంటుంది.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు కల్వల శిరీష సంజీవ్, నడిపెల్లి రామ్ మోహన్ రావు, నాయకులు కాల్వ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, మారేల్లి రాజిరెడ్డి, కొప్పుల శంకర్, ఉల్లంగుల రమేష్ తదితరులతో పాటు ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎండి అస్లాం, మేనేజర్లు ఆంబుల శ్రీనివాస్,అంకిత్ గుప్తా, వి. సాగర్ తో పాటు స్థానిక తదితరులు పాల్గోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App