Trinethram News : 2003, జనవరి 16 న రెండోసారి అంతరిక్షం లోకి వెళ్ళే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు. “భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జె.ఆర్.డి.టాటా యే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ను కెరీర్ గా తీసుకున్నా” అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశమేమిటని అడిగితే….. “ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని మీరు మనస్ఫుర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటే ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక,… దానిలో లీనమై అనుభవించాలి” అనేవారు. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నాట్లేనని చెప్పేవారు. అదే ఏడాది ఫిబ్రవరి 1న అంతరిక్షం నుండి తిరిగివచ్చే క్రమంలో జరిగిన ప్రమాదంలో మరణించారు.
1994 లో మొట్టమొదటి సారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడామెను “నాసా” వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా “నాసా”కు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చెసుకున్నారు. అంతమందినీ పరిశీలించి… కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995 లో మిగతా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు. టెక్సాస్ లోని హూస్టన్ లో గల జాన్సన్ స్పేస్ సెంటర్లో తన శిక్షణ చాలా ఆనందంగా గడిచిందంటారీమె… అక్కది శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ “శిక్షణ చాలా ఉత్కంఠభరితంగా ఉండేది. తమాషాగానూ ఉండేది లెండి.” అనేవారు. తరువాత విమానచోదకురాలిగా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు.
1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమే 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు.కల్పన 1988లో నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. విమాన యానానికి సంబంధించిన అనేకాంశాలపై పరిశోధనలు చేశారు. 1993 లో కాలిఫోర్నియా లోని లాస్ అల్టోన్ లో గల ఓవర్ సెట్ మెథడ్స్ ఇన్‌కార్పోరేటెడ్ లో ఉపాధ్యక్షురాలు (రీసెర్చి సైంటిస్ట్) గా చేరారు. అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షంలో శరీర కదలికలు, సమస్యలపై అనేక పరిశోధనలు చేశారు. ఏరో డైనమిక్స్ ఆప్టిమైసేషన్ కు సంబంధించిఅనేక టెక్నిక్స్ ను అభివృద్ధి పర్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు.
కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా రాష్ర్టంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17న జన్మించింది. ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1 1961కి మార్చారు. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం.సునీత, దీప, సంజయ్ ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ ముద్దుగా “మోంటు” అని పిలిచేవారు. ఆమె తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి. కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ.
2003 లో రెండవసారి స్పేస్ షటిల్ లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ నౌక ప్రమాదానికి గురవడంతో మరణించిన ఏడు మంది సిబ్బందిలో ఈమె కూడా ఒకరు. 2003 ఫిబ్రవరి 1 న వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆమె మరణానంతరం కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు. పలు వీధులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఈమె పేరు మీదుగా నామకరణం చేశారు. భారతదేశంలో కూడా ఆమెకు జాతీయ హీరోగా గుర్తింపు లభించింది. కల్పనా చావ్లా తర్వాత కాలంలో సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయ మూలాలున్న మహిళగా పేరు పొందారు.
ఫిబ్రవరి 1 కల్పనా చావ్లా వర్ధంతిని పురస్కరించుకుని