TRINETHRAM NEWS

Failure of owner protection is the cause of mine accident

కార్మికుడు మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ఆర్జీ వన్ లో జీడికే 11 ఇంక్లైన్ లో గని ప్రమాదంలో ఎల్ హెచ్ డి ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రతాప్ మీది నుండి ఎల్ హెచ్ డి బండి వెళ్లడంతో అతని కడుపు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదానికి సింగరేణి అధికారుల నిర్లక్ష్యమేనని సింగరేణి కాలరీస్ లేవర్ యూనియన్ టి ఎన్ టి యు సి వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు ఆరోపించారు.

ఆయన మాట్లాడుతూ, తరచూ రామగుండం 1లో గని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ సింగరేణి యజమాన్యానికి ఆర్జీ1 జీఎం కు ఉత్పత్తి పై ఉన్న ప్రేమ రక్షణ పై లేదని గని ప్రమాదానికి సంబంధిత అధికారులు ఏరియా జిఎంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జిఎం కార్యాలయము ముట్టడిస్తామని టిఎంటిఎస్సి హెచ్చరించింది.

ప్రమాదంలో మరణించిన ఇజ్జగిరి ప్రతాప్ కు రెండు కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కుటుంబంలో ఒకరికి తక్షణమే ఉద్యోగం, 250 గజాల స్థలం ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృత్తం కాకుండా పకడ్బందీగా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి అధ్యక్షుడు, సల్ల రవీందర్ పెద్దపల్లి పార్లమెంట టిఎన్టియుసి ఉపాధ్యక్షులు, పెగడపల్లి రాజనర్సు టిఎన్టియుసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీసు ఇంచార్జ్, చిటికెల రాజలింగం సింగరేణి కాంగ్రెస్ లేబర్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ, బక్కి వీరేందర్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, సుందిళ్ల స్వామి టౌన్ ఎస్సీ సెల్ కార్యదర్శి టిడిపి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Failure of owner protection is the cause of mine accident