TRINETHRAM NEWS

నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్ లు

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాలతో వేమన పల్లి మండలం లోని ఆశ్రమ పాఠశల వద్ద మావోయిస్టు ప్రభావిత ప్రాంత ప్రజల కోసం నీల్వాయి ఆధ్వర్యంలో పోలీస్ మీకోసం లో భాగంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో కంటి డాక్టర్ సుమారు 67 మంది కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించడం జరిగింది. వారిలో 25 మందిని చెన్నూర్ రూరల్ సిఐ సుధాకర్, నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల లోని శంకర్ నేత్రాలయ హాస్పిటల్ వారి సహకారం తో చెన్నూర్ లోని కిరణ్ హాస్పిటల్ లో కంటి ఆపరేషన్ శిబిరానికి తరలించడం జరిగింది. కంటి సమస్యతో బాధపడుతున్న మిగితా వారికి మళ్ళీ తేది ప్రకటించి ఆపరేషన్ క్యాంపుకు తరలించి కంటి ఆపరేషన్ చేపిస్తామని పోలీస్ వారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటు చట్టపరిధిలో సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణకోసం పని చేస్తాం అని ఎస్ఐ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App