TRINETHRAM NEWS

తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం. తమ్మినేని ప్రవీణ్ కుమార్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 3 : తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని కే పి హెచ్ పి డివిజన్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ తమ్మినేని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మోడీ దేశానికి ప్రధానమంత్రి లా కాకుండా పార్టీ కార్యకర్తల వ్యవహరించారని తమ్మినేని ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ప్రతిసారి మొండి చేయి చూపటం మోడీకి అలవాటుగా మారిందన్నారు. మోడీ చేతుల్లో కీలు బొమ్మగా మారిన నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కనీస స్థాయిలో కూడా నిధులు విడుదల చేయలేదని విమర్శించారు.

మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేసి పోయిందని అలాంటి పరిస్థితుల్లో మోడీ రాష్ట్రానికి పెద్దన్నలా ఉండి నిధులు కేటాయించి ఆదుకోవాల్సింది పోయి పెద్ద మొండి చేయి చూపించారని తీవ్రంగా విమర్శించారు. భవిష్యత్తులోనైనా మోడీ ఇలాంటి పక్షపాత ధోరణిని విడనాడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుందని ఆశలన్నీ అడియాసల య్యాయన్నారు. ఏ ఒక్క శాఖకు కనీస స్థాయిలో నిధులు కేటాయింపు జరగలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షరాలు సంధ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి, మహిళా అధ్యక్షురాలు పొన్నం రజిత, పొడుగు అప్పారావు, దివ్య, యమున, శ్రీదేవి, రేణుక తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App