
Exploded battery in school bus
Trinethram News : కామారెడ్డి జిల్లా: సెప్టెంబర్18
కామారెడ్డి పట్టణం లో బుధవారం ఉదయం ఓ స్కూల్ బస్సులో పెను ప్రమాదం సంభవించింది.
బస్సులో బ్యాటరీ పేలడం తో భారీగా పొగలు వ్యాపిం చాయి. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళ నకు గురై పరుగులు పెట్టారు..
వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను కిందకు దింపి.. మరమ్మ తులు చేశారు. ఘటనా సమయంలో బస్సులో సుమారు 30 మంది స్టూడెంట్స్ ఉన్నట్లు సమాచారం.
స్థానికులు వెంటనే స్పందిం చడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కామారెడ్డిలోని బ్రిల్లియంట్ గ్లామర్ స్కూల్ యాజమాన్యం ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడు తున్నారు.
ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్ప టికీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహ రించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

Comments are closed.