సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్ త్రినేత్రం నియోజకవర్గం ప్రతినిధి
విద్యాశాఖలో విలీనం చేసి, రెగ్యులరైజ్ చెయ్యాలనే ప్రధాన డిమాండ్ తో పాటు వేతనం పెంపు, PRC అమలు వంటి పలు డిమాండ్లతో 18 రోజులుగ నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులని ఈరోజు పట్టణంలోని RDO కార్యాలయం ఎదురుగ వారు నిర్వహిస్తున్న దీక్ష శిబిరం స్థలానికి వెళ్లి సంఘీభావం తెలిపిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు….
🔸ఉద్యోగుల సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరు వారికి, వారి కుటుంబాలకి బాధని మిగిలిస్తుంది.
🔸తాము అధికారంలోకి రాగానే చిటికెలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రగల్బాలు పలికిన CM రేవంత్‌రెడ్డి ఇప్పుడు అవన్ని మర్చిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
🔸నిధుల కేటాయింపులో కూడా విద్యాశాఖకి ముందుగా చెప్పినట్టుగా కాకుండా తక్కువగా కేటాయించటం ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ పట్ల ఉన్న నిర్లక్షానికి నిదర్శనం.
🔸విద్యాశాఖకి మంత్రివర్యులు లేని ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలోని ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే నాథుడు లేడు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, రామస్వామి, కృష్ణ, రాములు, PACS వైస్ చైర్మన్ పాండు, మాజీ సర్పంచ్ ల సంఘం వికారాబాద్ మండల అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, నాయకులు సత్యయ్య గౌడ్, మైనారిటీ నాయకులు గయాజ్, గఫ్ఫార్ నాయకులు పడిగళ్ళ అశోక్ మాజీ కౌన్సిలర్ లక్ష్మన్, మాజీ MPTC అల్లపురం శ్రీనివాస్, గాండ్ల మల్లికార్జున్, ఇంజనీర్ మల్లేష్, కొత్రేపల్లి ఇస్మాయిల్, కాషాయ్య, యువ నాయకులు సుభాన్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు బురాన్ పల్లి అనిల్, యువనాయకులు మంగలి ప్రవీణ్ కుమార్, శివరాం నగర్ కిషోర్, కోటాల గూడెం మహిపాల్, వీర్లపల్లి జైపాల్, వెంకట పూర్ తండా శీను, ఎన్నెపల్లి వరుణ్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App