TRINETHRAM NEWS

Trinethram News : తమిళనాడు: మార్చి 25
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై గురించి ప్రత్యే కంగా చెప్పాల్సిన అవస రమే లేదు. ఆమె గవర్నర్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.

గవర్నర్ గా రాజీనామా చేసేటప్పుడు తెలంగాణ ప్రజలను వదిలివెళ్లడం బాధగా ఉందని పేర్కొన్న విషయం విధితమే. ఇటీవలే తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేయడం.. ఎంపీ ఎన్నికల్లో బరిలో దిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.

అయితే సోమవారం నాడు మాజీ తెలంగాణ గవర్నర్ తమిళనాడులోని చెన్నె సౌత్ సెగ్మెంట్ కు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తమిళిపై పంచుకున్నారు. ‘

చెన్నె సౌత్ నియోజకవ ర్గానికి ఎన్డీఏ అలయెన్స్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను’ అని తమిళిసై ట్వీట్ చేశారు. ఇక, ఎంపీ ఎన్నికల వేళ తమిళనా డులో బీజేపీ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.

మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కీలక నేతలకు ఈ సారి కాషాయ పార్టీ ఎంపీ టికెట్లు కేటాయించింది. ఇందులో భాగంగానే తమిళిసైని గవర్నర్ తప్పించి మరి ఎంపీగా బరిలో నిలిపింది.