TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకునే విధంగా వారిలో అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు.బుధవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్లుగా నమోదు, మార్పులు చేర్పులు, బూతు స్థాయి ఏజెంట్ల నియామకం, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల ఖర్చుల సమర్పన తదితర అంశాలపై అదనపు కలెక్టర్లు కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యువతలో ఓటు ప్రాముఖ్యతను కలిగి ఉండేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారుఓటరుగా నమోదు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. మీసేవ, ఆన్ లైన్ , హెల్ప్ లైన్, మొబైల్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఫారం 7 ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవచ్చని అదేవిధంగా ఫారం 8 ద్వారా ఓటరు బదిలీ, పోలింగ్ కేంద్రం బదిలీ, కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చుకోవడం, ఓటరు ఐడీలో మార్పులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
బూతు స్థాయి ఏజెంట్ల నియామకం వారం రోజుల్లోగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అదనపు కలెక్టర్ సూచించారు. జాబితాలను పోలింగ్ కేంద్రం వారిగా బిఎల్ఏ ల మొబైల్ నంబర్ తో సహా తహసిల్దార్లకు లేదా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి జిల్లా పార్టీల అధ్యక్షుల సంతకాలతో సమర్పించాలని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నైమత్ అలీ, డిప్యూటీ తహసిల్దార్ ఉష్యా నాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Everyone who has completed