Everyone should take responsibility against drugs
గంజాయి ,మత్తు పదార్థాల చెడు వ్యసనాల పై యువతకు అవగాహన సదస్సు
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అందరు బాధ్యత తీసుకోవాలి
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్ రామగుండం కమిషనరేట్ పోలీసుల అధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది అని అందరు బాధ్యతగా తీసుకోని గంజాయి మత్తు పదార్థాల రహిత జిల్లాగా అందరూ బాధ్యత తీసుకోవాలని మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్. పిలుపునిచ్చారు.
రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ చెన్నూరు రూరల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ కోటపల్లి మండలం మోడల్ స్కూల్ లో గంజాయి, మాదక ద్రవ్యల పై అవగాహన ఉండాలని అవగాహనా, సూచనలు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం కు మంచిర్యాల డిసిపీ ఏ. భాస్కర్ ఐపిఎస్.ముఖ్య అతిథులు గా హాజరు కావడం జరిగింది.
ఈ సందర్బంగా డిసిపీ గారు మాట్లాడుతూ….యువత, విద్యార్థులు కొంత మంది వ్యక్తుల స్వార్థం కారణంగా యువతకు మత్తు పదార్థాలకు బానిసలు మారుతున్నారు. దీనితో మత్తు పదార్థాల నిర్మూలించి మత్తు పదార్థాల రహిత రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ గా గుర్తింపు తీసుకరావడంతో పాటు యువత మత్తు పదార్థాలకు దూరం చేసి, వారిలో భవిష్యత్తు చిరుగించడం కొసం మత్తు పదార్థాలపై యువత, గంజాయి, మాదక ద్రవ్యాల నివారణపై విద్యార్థులకుమొదటి నుండి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని డీసీపీ అన్నారు.
గంజాయి, గుట్కా, సిగరేట్‌కు యువత బానిస కాకుండా ఉన్నత చదువులు అభ్యసించి ఉన్న తమైన స్థానాలకు ఎదగాలన్నారు. కొందరు విద్యార్థి దశలో వ్యసనాలకు బానిస అవుతున్నారని మాదకద్రవ్యాల వినియోగంతో పిల్లల భవిష్యత్ అంధకారంగా మారుతుందని, వాటికి దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు ఆకర్షితులు కావొద్దు అని వాటికి ఆకర్షితులు అయి జీవితాలు నాశనం చేసుకోవొద్దు అని చెప్పారు.
విద్యార్థులు చదువు పై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితం లో ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా తమ తల్లీ తండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని తెలియచేసారు.
ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన యువకులు..వ్యసనాలకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు.
మత్తు కోసం అడ్డదార్లు తొక్కుతూ మత్తులో చిత్తు అవుతున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఎంతటి నేరానికైనా తెగిస్తున్నారు. యువత గంజాయికి బానిసలై జీవితాలు బలి చేసుకోకూడని, చేడు తిరుగుళ్ళు తిరగకుండ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి తల్లితండ్రుల కలలు, ఆశలను సాధించే దిశగా కెరీర్ పై దృష్టి సారించి చదువుకోవాలని సూచించారు. జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైనదని యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలన్నారు.
మత్తు పదార్థాలు సేవించడం వల్ల శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని యువత, విద్యార్థులు గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల మానసిక స్థితి సరిగా లేక నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. కొంతమంది చెడు వ్యసనాలు అలవాటు చేస్తున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
పోలీస్ శాఖ నిత్యం గంజాయి ఇతర మత్తు పదార్థాలు రవాణా చేసే వ్యక్తులు విక్రయించే వ్యక్తులపై నిత్యం నిఘా ఉంటుందని, గంజాయి సాగు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా సమాచారం ఉన్న పోలీస్ వారికీ అందించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లి ఎస్ ఐ రాజేందర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App