Everyone needs the message of Gautama Buddha: CM Revanth Reddy
Trinethram News : హైదరాబాద్ : ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని.. ప్రతి పనిని ధ్యానంగా చేయడాన్ని పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. బుద్ధ పూర్ణిమ పురస్కరించుకుని ఆయన సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”నేను పని చేసేటప్పుడు ధ్యానంగా ఉంటా. సమాజంలో అశాంతి, అసూయలను అధిగమించాల్సిన బాధ్యత అందరిది. మంచి సందేశం, ఆలోచనను పెంపొందించుకోవాలి..
సమాజానికి మేలు చేయాలన్న తలంపును ఇతరులకు పంచాలి. గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం. మహాబోధి బుద్ధ విహార్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తాం. ప్రతిపాదనలు పంపితే ఎన్నికల కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తాం” అని తెలిపారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App