
కుటుంబ సాధికార సారధులను నియమించాలన్న ఎమ్మెల్యే గోరంట్ల…
Trinethram News : ప్రతి కార్యకర్తకు సభ్యత్వ కార్డు అందజేసేలా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ బాధ్యత తీసుకోవాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈరోజు ఉదయం గోరంట్ల వారి కార్యాలయం నందు క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మన నియోజకవర్గంలో 57 వేల పైచిలుకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని, సభ్యత్వలను బూత్ వారీగా విభజించి 264 బూతులకు బూతు వారీగా ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరికి కార్డు పంపిణీ జరిగేలా క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
అలానే కుటుంబ సాధికార సాధులను నియమించాలని, ప్రతి 60 మంది ఓటర్లకు ఒక మహిళ ఒక పురుషుడు సాధికార సభ్యులుగా నియమించాలని తత్వారగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు మత్స్సేటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, గంగిన హనుమంతరావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కురుకురు కిషోర్,దండమూడి ప్రసాద్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, మద్దా మణి, కొత్తపల్లి సత్యనారాయణ, ఉండవల్లి బంగార్రాజు, తాడేపల్లి నాగరాజు, ఐ.టి.డి.పి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
