Every plant planted should be protected: District Collector Prateek Jain
Trinethram News : నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఈరోజు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు, 23వ వార్డులలో గల పార్కులలో స్థానిక వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా కలెక్టర్ , మున్సిపల్ చైర్ పర్సన్ లు మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, సకాలంలో వర్షాలు కురిసేందుకు చెట్లు దోహద పడతాయని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ రామస్వామి, కమిషనర్ జాకీర్ అహ్మద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆర్పీలు, పారిశుద్ధ్య సేవకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App