
ప్రతి రైతు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
తేదీ : 12/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, ఏ కొండూరు మండలం, గ్రామం ఉద్యాన వ్యవసాయ విభాగం అసిస్టెంట్ మందం. సురేష్ బాబు మాట్లాడుతూ ఉద్యాన కృషి అనేది వ్యవసాయ శాస్త్రం యొక్క ఒక ప్రత్యేక విభాగం అనడం జరిగింది పూలు, పండ్లు, కూరగాయలు సాగు ముఖ్యమైనవి అని చెప్పారు.
ప్రతి రైతు దుక్కి దున్నడం దగ్గర నుంచి పండించిన పంటను అమ్ముకునే వరకు అనేక నిర్వహణ కార్యక్రమాలు ఉంటాయని తెలపడం జరిగింది. ప్రతి రైతు తప్పనిసరిగా రైతు సేవ కేంద్రంలో ఫార్మర్ రిజిస్టర్ చేయించుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ వారు కోరడం జరిగిందని తెలిపారు.
రిజిస్టర్ చేయించుకున్న రైతుకు రైతు వారి అందించే ప్రతి ఒక్క బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి అన్నదాత సుఖీభవ, పంటల బీమా, ప్రభుత్వం అందించే వ్యవసాయ సాంకేతిక పరికరాలు, సబ్జిడికి ఇవ్వడం. పచ్చి రొట్టెల ఎరువులు ఇవి అందించడం జరుగుతుంది అని చెప్పారు. కావలసిన పత్రాలు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబరు/ఆధార్ లింక్ అయిన ఫోను , భూమి పట్టాదారు పాస్ బుక్/1B అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
