
తేదీ : 30/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పదవ తరగతి జవాబు పత్రాలను మూల్యంకనం చేసేందుకు ఏప్రిల్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రాష్ట్రం మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో రోజుకు 40 పేపర్లు చొప్పున మూల్యంకనం చేస్తారని వెల్లడించింది.
మూల్యంకనం చేసిన తర్వాత పత్రాల పున : పరిశీలనలో మార్కులు తేడా వస్తే సంబంధిత అధికారులపై
క్రమశిక్షణ చర్యలతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఏప్రిల్ చివరి వారంలో పదవ తరగతి ఫలితాలు రానున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
