ఎన్కౌంటర్ల పర్వాన్ని వ్యతిరేకించాలి
తేదీ : 02/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); చత్తీస్ గౌడులో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల సంఘాలు ప్రశ్నించాలని సి.పిఐ.యం. యల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ విజ్ఞప్తి చేయడం జరిగింది. బీజాపూర్ జిల్లాలో గంగులూర్ పోలీస్ స్టేషన్ పరిధి తోడ్కా అటవి ప్రాంతంలో పశ్చిమ బస్థర్ డివిజన్ ఏరియా కమిటీకి చెందిన మవోయిస్టుల సమావేశంపై పరమపాసవికంగా జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
శత్రువు సైన్యంపై పోరాడినట్లు వెయ్యి మందికి పైగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వు ఫోర్స్ కోబ్రా 202 బలగాలతో మన దేశ పౌరులపై కాల్పులు జరపటం అమానుషమన్నారు. నక్సలైట్లు ఎదురు కాల్పులు జరిపారు అన్నది కేవలం బూటకమని అనడం జరిగింది ఇప్పటికీ 800 మందికి పైగా ఎన్కౌంటర్లలో బలి తీసుకున్నారన్నారు. అనిసివేత ప్రతిఘటనకు దారితీస్తుందని హెచ్చరించడం జరిగింది.
అటవీ చట్టాలను సవరించి అక్కడి ఆదివాసులను వెల్ల గొట్టి భూ ఖనిజాలను కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నాలు అడ్డుకుంటున్న విప్లవ కారులను అనిసివేయాలనె ప్రయత్నమే 2026 సంవత్సరం నాటికి నక్సలైట్లు లేకుండా చేస్తామని హోంమంత్రి అమితా షా ప్రకటన సారాంశమని పేర్కొన్నారు. నక్సలిజం సమస్య గా చూస్తే పరిష్కారం కాదని సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యగా చూడాలన్నారు. ఆణ న వర్గాలపై దోపిడీ చేస్తున్న పాలకవర్గాలు పేదలకు అండగా నిలిచిన వారి ప్రాణాలను హరించే అధికారం ఏ చట్టం కల్పించిందని హరినాథ్ ప్రశ్నించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App