
సుక్మా: ఫిబ్రవరి 25
ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌం టర్‌లో నక్సలైటు హతమై నట్లు తెలిసింది.
బుర్కలంక గ్రామం సమీపాన శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. సంఘటన ప్రదేశం నుంచి నక్సల్ మృతదేహాన్ని, మజిల్ లోడింగ్ గన్‌ను స్వాధీనం చేసుకున్నామని సుక్మా ఎస్‌పి కిరణ్ జి చావన్ చెప్పారు.
నక్సల్ వివరాలు ఇంకా తెలియవలసి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు సాగుతోందని తెలిపారు.
