వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి.
గ్రామీణఉపాధి హామీ పనులలో రాజకీయ జోక్యాన్ని నివారించాలి.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్…
వలసలు నివారించాలని జిల్లా కలెక్టర్ కు బి కె ఎం యు వినతి
జిల్లా లో వలసలు లేవు జిల్లా కలెక్టర్
కాకినాడ, జనవరి,24: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వ్యవసాయ పనులు లేనందున వ్యవసాయ కూలీలు పట్టణాలకు వలసలు పోతున్నారని దీని వెంటనే నివారించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం కాకినాడలో ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, వలసలు నివారించే ప్రయత్నం చేయాలని, ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం 700 రూపాయలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు జాబ్ కార్డు తో నిమిత్తం లేకుండా అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాలని ఉపాధి హామీలో చేసిన పనికి సకాలంలో వేతనాలు చెల్లించాలని మధు కోరారు పెండింగ్ బకాయి బిల్లులు తక్షణమే చెల్లించాలని ఉపాధి హామీల్లో రాజకీయ జోక్యాన్ని ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల ప్రమేయం నివారించాలని ఆయన అన్నారు ఇప్పటికే గ్రామాలు వదిలి వలస వెళ్లిన వారిని తిరిగి గ్రామాలకు రప్పించి ఉపాధి పనులు కల్పించాలని చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాంటి పరిస్థితులు ఈ ఏర్పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యార్ధులకు యువతి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వ్యవసాయానికి సాగునీరు అందిస్తే ఉపాద అవకాశాలు పుష్కలంగా పెరిగితాయని వలసల నివారణకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు ఉపాధి హామీ చట్టంలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కూటమి ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన తర్వాత రాజకీయ కారణాలతో తీసివేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మధు డిమాండ్ చేశారు
జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేశవరపు అప్పలరాజు, పప్పు ఆదినారాయణ సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నక్క శ్రీనివాసరావు, రాజు ,వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App