
డిండి (గుండ్ల పల్లి) మార్చి 27త్రినేత్రం న్యూస్. 14వ విడత సామాజిక తనిఖీ లో భాగంగా ఈరోజు గురువారం నాడు గుండ్ల పల్లి) డిండి మండలం నందు ఉపాధి హామీ పథకం లో ఆర్థిక సంవత్సరం 2023 నుండి 2024 వరకు జరిగిన పనుల మీద తేదీ 18-3 -2025, నుండి 26-03-2025 వరకు మండలంలో నీ అన్ని గ్రామాలలో అన్ని పనులను పరిశీలి ంచి తయారు చేసిన నివేదికలను ప్రతి గ్రామ సభలు నిర్వహించిన నివేదికలను 27-03-2025న మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రజా వేదిక నిర్వహించడం జరిగింది.
అట్టి నివేదికల మీద నల్గొండ నుండి వచ్చిన అడిషనల్ డి ఆర్ డి ఓ గారు నివేదికలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్పీ వెంకన్న, డివో సిహెచ్ వేణుగోపాల్, దేవరకొండ క్లస్టర్ ఏపీ డి యామిని, ఏపీవో ఇన్చార్జ్ ఆర్ రాజు, ఆ మాతృ ఎస్ ఆర్ పి లు వెంకన్న మరియు అశోక్, మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సోషల్ ఆడిట్ బృందం, మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
