TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్ర వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో వై.కోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా అటవీ ప్రాంతంలో ఆహారం దొరకపోవడంతో గత కొంత కాలంగా అడవి జంతువులు తరచూ జనావాసాల్లోకి ప్రవేశించి ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత, ఏనుగుల దాడులలో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. అటవీ జంతువులు కనిపిస్తే వాటి ముందుకు వెళ్లకూడదని, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Elephants are in trouble