TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మే 15
లోక్‌సభ స్థానానికి సోమ వారం జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎం మెషిన్లను డీఆర్‌ కేంద్రాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌ లో సీల్‌ వేసి భద్రపరిచా మని హైదరాబాద్‌ పార్ల మెంట్‌ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు.

ఈవీఎం యంత్రాలను డీఆర్సీ కేంద్రాలలోని స్ట్రాంగ్‌ రూంలో నియోజకవర్గ జనరల్‌ అబ్జర్వర్‌ పీఐ శ్రీవిద్య సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీల్‌ వేసి భద్రపరచామన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీఆర్పిఎఫ్‌ పోలీస్‌ సిబ్బంది రౌండ్‌ ది క్లాక్‌ నిరంతర పర్యవేక్షణ చేస్తారన్నారు.

హైదరాబాద్‌ లోకసభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌ వారీగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని చార్మినార్‌, యాకుత్‌ పూర, కోఠి మహిళా పీజీ, డిగ్రీ కళాశాలలోని గోషామహల్‌, అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌లో గల మలక్‌పేట, బండ్లగూడలోని ఆరోరా యూనివర్సిటీలతో పాటు…

బహాద్దూర్‌ పూర అసెంబ్లీ సెగ్మెంట్‌, నిజాం కళాశా లలోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్‌, మాసాబ్‌ ట్యాంక్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోని కార్వాన్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లలో సీల్‌ వేసి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామ ని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో హైదరా బాద్‌ నియోజకవర్గ జనరల్‌ అబ్జర్వర్‌ పీఐ శ్రీవిద్య, ఏఆ ర్వోలు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.