TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి ఐక్యత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కూన చిన్నారావు

అక్షర విజేత అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఐక్యత ప్రెస్ క్లబ్. నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల పాత అధ్యక్షులు ఉదయ రాఘవేంద్రరావుని మరియు కొంతమంది కార్యవర్గ సభ్యులను కొన్ని కారణాలవల్ల తొలగించి కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కూనచిన్నారావు. కార్యదర్శిగా పామర్తి మధు. కోశాధికారిగా చిన్నం శెట్టి వెంకట నాగబాబు. ఉపాధ్యక్షులుగా కాండ్రు కోట ఉదయ్ కుమార్. మద్దు రవికుమార్. సహాయ కార్యదర్శిగా మడకం వెంకన్నబాబు. దాది సంటి. లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు వెంటనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై స్పందించి వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.
రాష్ట్రంలో జర్నలిస్టులపై జరిగిన దాడులపై దాడులను అరికట్టాలని.ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వెంటనే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని అన్నారు. మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయాల నుంచి ఇంటి వరకు రాత్రిపూట రవాణా సదుపాయం కల్పించాలని విన్నవించారు. అలాగే ఇతర రాష్ట్రాల మాదిరిగా జర్నలిస్టులకు పెన్షన్ విధానం కూడా అమలు చేయాలని తెలిపారు.
చిన్న పేపరు పెద్ద పేపర్ అని తేడా లేకుండా.అక్రిడిటెషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో. కార్యవర్గ సభ్యులు.మధు ప్రశాంత్. గోళ్ళ నవీన్ కుమార్. శివశంకర్. కురసం రవి. ఆకుల శ్రీను. నారందిలీప్ కుమార్. తోకల రాంబాబు.అల్లాడి మాధవరావు. బాలిని శివన్నారాయణ. తదితరులు పాల్గొన్నారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App