TRINETHRAM NEWS

Election of Gangarapu Lingamurthy as General Secretary of Singareni SC ST Welfare Association

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630 /1982 సర్వసభ్య సమావేశం శనివారం శ్రీరాంపూర్ ఏరియా లో నిర్వహించారు. తామేరా ప్రవీణ్ కుమార్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర కమిటీ నాయకులు మరియు అన్ని ఏరియాలో ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణిలో ఎస్సీ ఎస్టీ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు.

అలాగే ఖాళీగా వున్న అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ స్థానాన్ని ఈరోజు జరిగిన సమావేశంలో సభ్యులు గోదావరిఖని ఆర్జీ1 కు చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ గంగారపు లింగమూర్తిని జనరల్ సెక్రెటరీగా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గోడ రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆరెపల్లి రామచందర్, బాదం వెంకటేష్, కుమార్, హరి, తిరుపతి, నాగయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Election of Gangarapu Lingamurthy as General Secretary of Singareni SC ST Welfare Association