TRINETHRAM NEWS

Trinethram News : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది.

మార్చి 13న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే ఈసీ ప్రకటించింది.

2019లో సార్వత్రిక ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. మే 23 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఇంచుమించు ఇదే విధంగా షెడ్యూల్ ఉంటుందని భావిస్తున్నారు.

ప్రధాని మోదీ మార్చి 12 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి ఈ టూర్ కు శ్రీకారం చుట్టారు. మార్చి 4న తెలంగాణ, తమిళనాడులో పర్యటించారు. మార్చి 5న తెలంగాణలోనే పర్యటన చేస్తున్నారు. ఆ తర్వాత మరో 10 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు వెళ్లనున్నారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటన మార్చి 12తో ముగుస్తుంది. ఆ తర్వాత రోజే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.