TRINETHRAM NEWS

ఏపీని వణికిస్తున్న భూకంపాలు

Trinethram News : ప్రకాశం జిల్లా : డిసెంబర్ 22
ఏపీలో మరోసారి భూకంపం కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజాగా ఈరోజు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవిం చాయి.

దీంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. శనివారం ఇదే జిల్లాలోని తుళ్లూరు మండల పరిధిలో 3 సెకన్లు భూమి కంపిం చింది. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. శంకరాపురం, పోలవరం , పసుపుగల్లులో భూమి కంపించినట్లుగా గ్రామ ప్రజలు తెలిపారు.

ముండ్లమూరు మండల పరిధిలోని మారెళ్ల, ముండ్లమూరు, తుర్పు కంభంపాడు, వేంపాడు, శంకరాపురంలో స్వల్పంగా భూమి కంపించింది. ముండ్లమూరు పాఠశాలలో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యా లయాల్లోని ఉద్యోగులు కూడా భయంతో వణికిపోయారు.

వరుసగా రెండో రోజు ముండ్లమూరు పరిధిలో భూకంపం రావడంతో అసలు ఏం జరుగుతోందని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు గ్రామ ప్రజలు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App