TRINETHRAM NEWS

Dussehra, Sankranti holidays for schools like this

Trinethram News : వేసవి సెలవులు ముగుస్తున్నాయి. తిరిగి విద్యా సంవత్సరం ప్రారంభానికి పాఠశాలలు సిద్దం అవుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సర అకడమిక్ క్యాలెండర్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు అమలు చేయాల్సిన క్యాలెండర్ ను విడుదల చేసింది. వేసవి సెలవుల తరువాత జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో బోధన..పండుగల సెలవుల గురించి క్యాలెండర్ లో స్పష్టత ఇచ్చారు.

క్యాలెండర్ విడుదల

తెలంగాణ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్‌ను విద్యా శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్‌ 12న ప్రారంభమై.. ఏప్రిల్‌ 23న ముగియనున్నాయి.

2025 ఏప్రిల్‌ 24 నుంచి 2025 జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. దసరా సెలవులు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఇంకా సంక్రాంతి సెలవులు 2025 జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయని వెల్లడించింది.

యెగా తరగతులు

ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 5 నిమిషాలు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-1 ఎగ్జామ్స్ ను ఈ ఏడాది జూలై 31 లోగా, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-2 పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 లోగా, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (SA)-1 పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 28 వరకు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-3 పరీక్షలను ఏడాది డిసెంబర్‌ 12 లోపు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-4 పరీక్షలను 2025 జనవరి 29 లోపు, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (SA)-2 పరీక్షలను 2025 ఏప్రిల్‌ 9 నుంచి 2024 ఏప్రిల్‌ 29 వరకు (1 నుంచి 9 తరగతులకు) నిర్వహించనున్నారు.

మార్గదర్శకాలు జారీ

ప్రీ ఫైనల్‌ (10వ తరగతి) పరీక్షలను 2024 ఫిబ్రవరి 28లోపు, ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలను 2024 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొంది. పరీక్షల షెడ్యూల్ ను రెండు నెలల ముందు విద్యా శాఖ వెల్లడించనుంది.

అదే సమయంలో విద్యార్ధులకు పాఠశాలల్లో సౌకర్యాల కల్పన పైన ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను స్పష్టం చేసింది. అదే విధంగా ఇప్పటికే ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ పైన అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ప్రభత్వం విడుదల చేసిన క్యాలెండర్ అన్ని పాఠశాలలు అమలు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dussehra, Sankranti holidays for schools like this