TRINETHRAM NEWS

Duddula Sridhar Babu, State Minister of IT Industries, distributed certificates to women

మంథని, జూన్ -19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రస్తుత సమాజంలో మంచి నైపుణ్యం గల వ్యక్తులు విద్యా వంతుల కంటే అధికంగా ఆదాయం సంపాదిస్తున్నారని, మంచి నైపుణ్యత ఉంటే మెరుగైన ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

బుధవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ తో కలిసి మంథనిలోని తన క్యాంపు కార్యాలయంలో న్యాక్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,*మనకు మంచి నైపుణ్యం ఉంటే దేశ,విదేశాలలో మంచి ఆదాయంతో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్ ల కంటే శిక్షణ పొంది నైపుణ్యం కల్గిన ప్లంబర్, కార్పెంటర్…. మొదలగు వృత్తుల వారు అధికంగా సంపాదిస్తున్నారని మంత్రి తెలిపారు.

న్యాక్ శిక్షణ కేంద్రం ద్వారా ప్రజలకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కుట్టు మిషన్లలో శిక్షణ పొందిన మహిళలు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవాలని, బహిరంగ మార్కెట్ లో నైపుణ్యం కలిగిన టైయిలర్లకు మంచి డిమాండ్ ఉందని, ఎంబ్రాయిడరీ వంటి విద్యలో సైతం శిక్షణ తీసుకుంటే మరింత మెరుగైన ఆదాయం ఆర్జించవచ్చని మంత్రి సూచించారు.

కుట్టు మిషన్లలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్ ఉచితంగా పంపిణీ చేస్తామని, ప్రభుత్వం తరఫున అవకాశం ఉన్న మేరకు మహిళా సంఘాలకు దుస్తులను కుట్టే ఆర్డర్లు అందిస్తామని, స్కూల్ విద్యార్థుల ఏకరూప దుస్తులను సైతం మహిళా సంఘాల చేతనే కుట్టించామని మంత్రి పేర్కొన్నారు.

యువతకు మంచి నైపుణ్యాలతో శిక్షణ అందించే దిశగా పెద్దపల్లిలో టాస్క్ కేంద్రం ఏర్పాటు చేశామని, అదేవిధంగా మంథనిలో సైతం ట్రెడ్స్ సంబంధిత శిక్షణా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళా సాధికారత దిశగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పి.రమ, ఎంపీపీ కొండా శంకర్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Duddula Sridhar Babu, State Minister of IT Industries, distributed certificates to women