త్వరలో పట్టణం లోని త్రాగునీటి సమస్య లేకుండా చేస్తాo – కందుల
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం.31.1.25, ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని 5 వ వార్డ్ లో “మన ఊరు -మన ఎమ్మెల్యే” కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ 5వ వార్డులో త్రాగునీటి పైప్ లీకేజ్ ల సమస్య అధికంగా ఉందని గత ప్రభుత్వంలో పైపులైను వేసిన కాంట్రాక్టర్లు దీన్ని అసంపూర్ణంగా పూర్తి చేశారని , సిమెంట్ రోడ్ల కింద పైప్ లైన్లు ఉన్నాయని తద్వారా పైప్ లైన్ల లీకేజీల సమస్య ఉత్పన్నo అవుతుందని త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అన్నారు.
పట్టణం నడిబొట్టున ఉన్న ఈ ప్రాంతం వెనుకబడిన ఎస్సీలు ఓసీలు అధికంగా నివసిస్తున్నారని త్వరలోనే కాంట్రాక్టర్ల ను పిలిచి మాట్లాడి మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఈ వార్డు పర్యటనలో మున్సిపల్ అధికారులు తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App