
డిండి (గుండ్ల పల్లి) మార్చి 27 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నీ పద్మశాలి కలని లో (మార్కండేయ గుడి వీధి) 5వ వార్డు లో డ్రైనేజీ కాలువలు జాం అయ్యి దుర్గంధం వెదజల్లుతున్న , దోమబరిన పడి కలని వాసులు జ్వరం రోగాల పడుతున్న పట్టించుకోని పారిశుధ్య కార్మికులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించు కోవడం లేదని ,, కాలనివాసులు వాపోతున్నారు.
చెత్త పేరుకుని పోయి కాలని మొత్తం చెత్త తో నిండి వుంది
సర్పంచ్ ల పదవీ కాలం ముగియడంతో కాలనీలను పట్టించుకొనే నాథుడు కరువయ్యాడని, కాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని పారిశుద్ధ్య విషయంలో గ్రామపంచాయతీ అధికారులు అలసత్వం సహించవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న డిండి గ్రామంలో పంచాయతీ మాత్రం పారిశుద్ధ్య పనులను పట్టించుకునే వారే లేరు.
చిన్న చిన్న గ్రామపంచాయతీలు మాత్రం పారిశుద్ధ్య పనులపై ముందడుగు వేస్తుంటే మండల కేంద్రమైన డిండి మాత్రం వెనుకడుగులో ఉందని గ్రామ ప్రజలు చెబుతున్నారు చిత్త సేకరణలో పంచాయతీ కార్యదర్శి సమయపాలన పాటించడం లేదని వీధిలోని చెత్త సేకరించే డాక్టర్ సమయపాలన పాటించడం లేదని కాలనీవాసులు విచారణ వ్యక్తం చేస్తున్నారు కొత్త సేకరించే ట్రాక్టర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదని గృహినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి ప్రధాన రోడ్లలో చిత్తకుండీలను ఏర్పాటు చేయాలని, డ్రైనేజీ కాలువలను బాగు చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని డిండి ప్రజలు ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
