TRINETHRAM NEWS

పల్లె దవఖాన వైద్యాధికారులు వేతనం 54000/- చెల్లించాలని, ఎం.ఎల్.హెచ్.పి.పేరును మార్చి పల్లె దావాఖన మెడికల్ ఆఫీసర్ (PDMO) పెట్టాలని డాక్టర్. పుట్ట. మహేందర్ రావు డిమాండ్

హైదరాబాద్ జిల్లా
11 నవంబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ నందు 2020 నుండి పలు దఫాలుగా ఎం.ఎల్.హెచ్.పి. పల్లె దావఖన రిక్రూట్మెంట్ అవటం జరిగిందని,వీరందరినీ ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం రోజున హైదరాబాదులో డాక్టర్. పుట్ట మహేందర్ రావు అధ్యక్షత జరిగినది . MLHP(మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) పల్లె దావఖన యూనియన్ సమావేశం త్వరలో దిశా దశ మంత్రి సమీక్షలో నిర్వహించడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేశారు, ఈ సందర్భంగా డాక్టర్. శ్రీనివాస్ మాట్లాడుతూ… పల్లె దావఖన వైద్యాధికారులకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు , వీరి చదువులలో తేడాలు ఉన్నప్పటికిని అందరూ చేసే పని ఒకటే ,కానీ పల్లె దావఖన వైద్యాధికారులకు ప్రస్తుతం వేతనం రూ.40 వేలు తక్కువ వేతనం ఇస్తున్నారని,ఎలాంటి షరతులు లేకుండా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యాధికారికి 54000/- ఇస్తున్నారు, కావున పల్లె దావఖన వైద్యాధికారులకు కూడా ఇవ్వాలని అన్నారు,మిగిలిన రాష్ట్రాల్లో కూడా పల్లె దావఖన వైద్యాధికారులకు ప్రతి నెలకు 54000/- వేతనాన్ని చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. అదే విధంగా ఫీల్డ్ లెవల్ లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము.

కొన్ని ముఖ్యమైన డిమాండ్స్ పాయింట్స్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది కొద్దిగా అవి అమ్మలేటట్టు చెయ్యండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్న పల్లె దవాఖాన వైద్యాధికారులు

1.ఇతర రాష్ట్రాలలో మాదిరిగానే వీరిని ఆయుష్మాన్ భారత్ మెడికల్ ఆఫీసర్ గా పరిగణించాలి (లేదా) పల్లె దావఖన వైద్యాధికారిగా డెసిగ్నేషన్ చేంజ్ చేయాలి

2.క్యాడర్ ఫిక్సెషన్ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

3.ప్రతి ఒక్కరికి 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ను మరియు వారి కుటుంబ సభ్యులందరికీ వర్తించే విధంగా అమలు చేసి చెల్లించాలి

4.ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లించాలి

5 పల్లె దావఖానలలో పనులకు కాకుండా PHC డ్యూటీలు కూడా వీరికి వేస్తున్నారు,వెంటనే వాటిని ఆపివేయాలి

6.పి.ఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి

7.పల్లె దావఖన సబ్ సెంటర్ నందు వీలైనంత త్వరగా పక్కా భవనాలను కట్టాలి

8.పల్లె దావఖాన బిల్డింగ్ కు సంబంధించిన రెంట్/ కరెంటు బిల్లును ఎన్ హెచ్ ఎం సంస్థ నుండే చెల్లించాలి

9.ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న మాదిరిగా మన రాష్ట్రంలో కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ (PBI)లను అమలు చేయాలి.

10.మహిళలందరికీ వేతనంతో కూడిన 6 నెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి

11.ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి

12.పని భారాన్ని తగ్గించి అందరికీ వెంటనే ఇంటర్నెట్ తో కూడిన లాప్టాప్ (లేదా) ట్యాబ్లను మంజూరు చేయాలి

13.దావఖనలలో విద్యుత్, తాగునీరు, మరియు నీటి సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలి, మరుగుదొడ్లు వెంటనే ఏర్పాటు చేయాలి

14.పల్లె దావఖనకు సంబంధించిన స్టేషనరీ బిల్స్తో పాటు ఇతర కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను ఎన్ హెచ్ ఎం నుండి విడుదల చేయాలి

ఈ సమావేశంలో పల్లె దావఖన వైద్యాధికారులు డాక్టర్.పుట్ట మహేందర్ రావు, డాక్టర్ శ్రీనివాస్ ,డాక్టర్ వెంకన్న ,డాక్టర్ శివశంకర్ ,డాక్టర్ లహర్ గాంధీ, డాక్టర్ కుమార్ మరియు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App