TRINETHRAM NEWS

సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ .
సమ సమాజ నిర్మాణ దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్అంబేద్కర్ అని వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు వికారాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు అనితర సాధ్యమని స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికేఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాలె లక్ష్మణ్, దీపు, సర్పారాజ్, టైగర్ కృష్ణ, మల్లేశం, జగదీష్, ఆలంపల్లి సురేష్, రామచందర్, మయూర్, బి.రవీందర్, అశోక్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App