TRINETHRAM NEWS

కబ్జాలపై నిర్లక్ష్యం వద్దు- కోర్ట్ పత్రాలంటూ కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరం, సురారం,జగతగిరిగుట్ట ప్రాంతంలో కొద్దిమంది కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చూపించి ఎకరాల కొద్దీ కబ్జాచేసి అది సరిపొన్నట్లు మరొకసారి కోర్టు తీర్పు, డాక్యూమెంట్లు పేరుతో కబ్జాచేస్తున్నారని అటువంటి వారిని వదలకుండా కఠినంగా శిక్షించి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.సర్వే నెంబర్12,దేవేందర్ నగర్ డబల్ బెడ్రూం,329,326,342 లలో కొత్తగా ఇండ్లు కట్టి కోర్టు ఆర్డర్ అంటూ కబ్జాచేస్తున్నారని వెంటనే కుల్చోవెయ్యలని కోరుతూ నేడు సీపీఐ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ లేకపోవడం వల్ల ఆర్ ఐ రేణుక గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే నేడు కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు బహిరంగంగా రెచ్చిపోతున్నారాని ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకొని భూమిని కాపాడాలని కోరారు.గత నెల గుర్తించబడిన మొత్తం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పి తూతుమంత్రంగా కూల్చివేయడం వల్ల మళ్ళీ కబ్జాదారులు కట్టడాల దగ్గర చదును చేసుకుంటూ కొద్దీ రోజుల్లో మళ్ళీ నిర్మాణాలు చేస్తామని డబ్బులు ఇచ్చి మోసపోయిన వారిని ఇంకా మోసం చేస్తున్నారని, అక్కడక్కడా నిర్మాణాలకు సిద్ధం అవుతున్నారని కావున కఠినమైన చర్యలు తీసుకోకుండా పైపై చర్యలు తీసుకుంటే లాభం లేదన్నారు. రెవెన్యూ అధికారుల పై అనుమానం కలుగుతుందని కావున ఆ అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు.సర్వే బంధం చెరువు,కొత్త చెరువులో నిర్మాణాలు జరుగుతున్నాయని పత్రికలలో వచ్చినా, ప్రత్యక్షంగా మీకు చెప్పిన కూడా పట్టించుకోకప్పవడం అన్యాయమని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్,మండల కోశాధికారి సదానంద,ఇమామ్,ప్రభాకర్ లు పాల్గొన్నారు.