TRINETHRAM NEWS

Don’t pay Singareni pensions even for four days

సిఎంపిఎఫ్ అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే పెన్షన్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వేయాలి

లేకుంటే సిఎంపిఎఫ్ ఆఫీసు ను ముట్టడి చేస్తాం.

దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి లో దశాబ్దాల పాటు పని చేసి పదవీ విరమణ చేసిన అనంతరం వారికి ప్రతి మొదటి తారీఖు న బ్యాంకు లో పడె పెన్షన్ నాలుగు రోజులు గడిచినా సిఎంపిఎఫ్ అధికారులు పెన్షన్ బ్యాంకు లో వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, వెంటనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉన్న సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ కి పెన్షన్ వేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దెల దినెష్, ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.గౌస్, దళిత హక్కుల పోరాట సమితి నగర కార్యదర్శి ఎర్రల రాజయ్య లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

శుక్రవారం గోదావరిఖని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యానగర్ బ్రాంచి ముందు పెన్షన్ తీసుకుందామని బ్యాంకు కు సింగరేణి రిటైర్డ్ కార్మికుల తో కలిసి సిఎంపిఎఫ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ కి సిఎంపిఎఫ్ అధికారులు యూనియన్ ఆఫ్ ఇండియా లో పెన్షన్ వేస్తే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దేశం లో ఉన్న బొగ్గు గని రిటైర్డ్ ఎంప్లాయిస్ బ్యాంకు ఖాతాలకు పంపడం వల్ల ప్రతి నెలా మొదటి తారీఖు న రిటైర్డ్ ఎంప్లాయిస్ కి సిఎంపిఎఫ్ పెన్షన్ పడెదని, కానీ సిఎంపిఎఫ్ అధికారులు రెగ్యులర్ గా వస్తున్న పెన్షన్ ను అకారణంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సిఎంపిఎఫ్ పెన్షన్ పంపిణీ విధానాన్ని గత కొన్ని సంవత్సరాల క్రితం మార్చారని వారు ఆరోపించారు.

ఎప్పుడైతే పెన్షన్ పంపిణీ విధానాన్ని సిఎంపిఎప్ యూబిఐ నుంచి ఎస్బిఐ కి మారడం ప్రతి నెలా మొదటి తారీఖు న బ్యాంకు లో జమ కావలిసిన పెన్షన్ వారం రోజుల వరకు ఎస్బిఐ బ్యాంకు వారు ఆపుతున్నారని వారు ఆరోపించారు. రిటైర్డ్ ఐన కార్మికుల కు తమ అవసరాల కోసం వచ్చే పెన్షన్ ఆలస్యం వల్ల అనేక అవస్తలు పడుతున్నారని వారు పేర్కొన్నారు. మంచిగా పంపిణీ చేసే యూబిఐ నుంచి ఎస్బిఐ కి ఎందుకు మార్చారో చెప్పాలని వారు సిఎంపిఎఫ్ అధికారులను ప్రశ్నించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ పెన్షన్ కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు వెళితే ఎస్ బి ఐ బ్యాంక్ వాళ్ళు పంపలేదు మేం ఏం చేయలేమని చేతులెత్తేశారని వారు తెలిపారు.

ఎస్ బి ఐ కార్పోరేట్ లాభియింగ్ వల్ల సిఎంపిఎఫ్ అధికారులు యూబిఐ బ్యాంకు కు నిలిపి వేశారని ఆరోపణలు వస్తున్నాయి.

ఎస్ బి ఐ కార్పోరేట్ లాభియింగ్ వల్ల సిఎంపిఎఫ్ అధికారులు పెన్షన్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు నిలిపివేశారని బయట ప్రచారం జరుగుతోందని వారు తెలిపారు. దీనిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ అధికారులు స్పందించి పెన్షన్ పంపిణీ విధానాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు ఎందుకు మార్చడం జరిగిందో విచారణ జరిపితె వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన వారు పేర్కొన్నారు. కనుక ఇట్టి కార్పోరేట్ లాభియింగ్ పై కేంద్ర ప్రభుత్వం సిఎంపిఎఫ్ అధికారుల పై, ఎస్ బి ఐ అధికారుల పై విచారణ జరిపి బొగ్గు గని రిటైర్డ్ ఎంప్లాయిస్ కి గతంలో లాగా ప్రతి నెలా మొదటి తారీఖు న బ్యాంకు ఖాతా లలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు, లేనిచో రిటైర్డ్ ఎంప్లాయిస్ తో కలిసి సిఎంపిఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని వారు హెచ్చరించారు

Don't pay Singareni pensions even for four days