Trinethram News : చిన్నపిల్లలను అపహరించే ముఠా నగరంలో ప్రవేశించిందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని హనుమకొండ ఏసీపీ వెల్లడించారు. ఈ మేరకు ఏసీపీ కమిషనర్ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. పిల్లలను ఆపహరించేందుకు ఎలాంటి ముఠాలు నగరంలోకి రాలేదని, అసత్యప్రచారాలు నమ్మవద్దన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసు యంత్రాంగం పటిష్టమైన నిఘాతో బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు.. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేయటం సరికాదన్నారు. అనుమానా స్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100, పోలీసు కంట్రోల్ రూమ్ 8712 685070నెంబరుకు సమాచారం అందించాలన్నారు.
వదంతులు నమ్మొద్దు-హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్
Related Posts
రామగుండం ఎమ్మార్పీఎస్. ఎంఎస్ పి కార్పొరేషన్ సమావేశం
TRINETHRAM NEWS రామగుండం ఎమ్మార్పీఎస్. ఎంఎస్ పి కార్పొరేషన్ సమావేశం మాలల ఒత్తిడితోనే ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 29వ తేదీనాడు రామగుండం ఎమ్మార్పీఎస్. ఎం ఎస్ పి మున్సిపల్ నూతన కమిటీ నియామకం…
పొలం బాటలో విద్యుత్ అధికారులు
TRINETHRAM NEWS పొలం బాటలో విద్యుత్ అధికారులు రచ్చపల్లి గ్రామం ,ధర్మారం మండలం లో విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సూపరింటెండింగ్ ఇంజనీర్ కంకటి మాధవరావు వినియోగదారులతో మాట్లాడుతూ గ్రామం లో…