TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి కొత్తూరు శివాలయం వివాదంపై మాజీ ఎమ్మెల్యే,వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎమ్మెల్యే,నల్లమిల్లి పాత్రికేయులతో మాట్లాడుతూ…..

ఇటీవల అనపర్తి కొత్తూరు శివాలయం విషయంలో జరిగిన వివాదంపై మాజీ ఎమ్మెల్యే,సత్తి సూర్యనారాయణరెడ్డి, సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటూ సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. అసలు సనాతన ధర్మం పదం బాగుందని వారు మాట్లాడారా లేక అర్ధం తెలిసి మాట్లాడారా అని వారిని ప్రశ్నిస్తున్నా?

అసలు గత ఐదు సంవత్సరాలుగా అనపర్తి నియోజకవర్గంలో సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి అసలు మత ధర్మాలకు, మానవత్వానికి ఏ విధంగా విఘాతం జరిగిందో ఒకసారి మాట్లాడాలని ఈసమావేశం ఏర్పాటు చేసాం,

గత ఐదేళ్ళుగా నియోజకవర్గంలో ఆలయాల ప్రతిష్ఠకు ఏవిధంగా భంగం వాటిల్లిందో అన్ని విషయాలు చెప్పాలంటే గంటలు కాదు రోజులు తరబడి చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం,

అనపర్తి వీరుళ్ళమ్మ ఉత్సవాలలో జెయింట్ వీల్ మరియు షాపుల దగ్గర డబ్బు దారుణంగా వసూలు చేయడమే గాక ప్రజల నుండి విరాళాలు కూడా వసూలు చేసి ఎవరికీ లెక్కలు చెప్పని పరిస్దితి గత ఐదేళ్ళుగా జరిగింది. …ఇది సనాతన ధర్మమా? అని అడుగుతున్నా?

భజన కార్యక్రమాలు నిర్వహించే సత్సంగాలను రాజకీయాల కోసం విడదీసిన పరిస్దితి.. ఇది సనాతన ధర్మమా? అని అడుగుతున్నా?

వీరుళ్ళమ్మ ఉత్సనాలలో సూర్యనారాయణరెడ్డి పోటోలు ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకోవడం సనాతన ధర్మమా అని అడుగుతున్నా

బాపనమ్మ ఆలయ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని యువత ఆరోపణలు చేస్తే ఉపాలయం పేరుతో ఆలయాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చారు. అక్కడ ప్రతిష్ట ఆగమశాస్త్రం ప్రకారం జరుగలేదు. యేటా కొత్త అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ ఉంచేవారు కానీ ఇపుడు ఉపాలయం కారణంగా అమ్మవారిని తీసుకురాలేని పరిస్దితి గ్రామస్దులకు వచ్చింది. ఇది మీ వల్ల జరిగిన అపచారం కాదా? ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదా? ఇది సనాతన ధర్మమా? అని అడుగుతున్నా?

మీరు నేను సతీసమేతంగా సత్యప్రమాణం చేసిన బిక్కవోలు లక్ష్మీగణపతి గర్భాలయంలో ఆ సందర్భంలో మీరు మాట్లాడిన భాష సనాతన ధర్మమా?

ఆనాడు అసహనంతో మీరు సాక్షాత్తు లక్ష్మీగణపతి విగ్రహంపై కొట్టడం, స్వామివారి నుదుటి వెండి బొట్టు రాలిపడటం… ఇదంతా సనాతన ధర్మమా? అని అడుగుతున్నా?

నేను ఎమ్మెల్యే,గా ఉండగా చిరంజీవి రాజ్యసభ నిధులతో సంపరలో ఆలయ నిర్మాణం జరిగి మీరు ఎమ్మెల్యే గా అయిన తర్వాత ప్రతిష్ఠ జరిగితే ఆ కార్యక్రమానికి మిమ్మల్ని, నన్ను, జనసేన ఇంచార్జ్ ను గ్రామస్దులు ఆహ్వానించినపుడు రామకృష్ణారెడ్డిని పిలవడానికి వీల్లేదని మీరు చెప్పినప్పటికీ నిధులు మంజూరు చేసిన నన్ను గ్రామస్ధులు పిలిచిన సంగతి వాస్తవం కాదా? అక్కడ మీ సతీమణికి దండ వేయలేదనే కారణంతో ఆలయ కమిటీని ఆ రాత్రంతా జైళ్ళో పెట్టించిన సంగతి వాస్తవమా కాదా? ఇది సనాతన ధర్మమా అని అడుగుతున్నా?

పునర్నిర్మాణం జరిగిన అనపర్తి జనార్ధన స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ ఆగమ శాస్త్రానికి విరుద్దంగా జరిగిందా లేదా చెప్పమని డిమాండ్ చేస్తున్నా, ఆగమ శాస్త్ర నిపుణుల మాట కాదని, దేవాదాయ శాఖ అధికారుల మాట కాదని మీ సతీమణి ఆజ్ఞ ప్రకారం శిలాఫలకాలపై మీ పేర్లు వేయించుకోవడం కోసం అధికారుల పై ఒత్తిడి తెచ్చి ప్రహారీ నిర్మాణం జరుగకుండా ఆగమశాస్త్ర విరుద్దంగా ప్రతిష్ఠ జరిపించడం జరిగింది ఇది సనాతన ధర్మమా అని అడుగుతున్నా?

దేవాదాయశాఖ నిధులతో నిర్మించిన ఆ ఆలయ ప్రతిష్ఠ రోజున వెంకటేశ్వరస్వామి వారి నామస్మరణ వదిలేసి మీ దంపతుల నామస్మరణ జరిపించుకోవడం సనాతన ధర్మమా అని అడుగుతున్నా,

మీ తొందరపాటు చర్యల వలన ఆలయ రూప్ దెబ్బతిని వాటర్ లీకేజి అవుతుంది. ఇదేనా సనాతన ధర్మం,

పొలమూరు మదన గోపాలస్వామి ఆలయంలో సాక్షాత్తూ “మదన” గోపాలుడే పూజారిగా ఉంటే ప్రోత్సహించడం సనాతన ధర్మమా అని అడుగుతున్నా,
నాడు రంగంపేట శివాలయం పునర్నిర్మాణం కోసం మిమ్మల్ని కోరితే నిధులు ఉండి కూడా లేవని మీరు మాట్లాడిన తీరు ఎంత దారుణం. నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆలయానికి 2.25 కోట్లు మంజూరు చేయించాం,
బలభద్రపురంలో వెలమలు సొంత డబ్బుతో రామాలయం నిర్మిస్తే మేం ఉడతాభక్తిగా తెలుగుదేశం పార్టీ తరపున వంట షెడ్ కోసం 20 లక్షలు యంపి నిధులు మంజూరు చేయిస్తే మీరు యేడాదిపాటు తాత్సారం చేసి ఆ నిధులు కేన్సిల్ అయిపోయాయి అంటూ తప్పుడు ప్రచారం చేసారు. మేం అధికారంలోకి వచ్చాక ఆ గ్రాంటు బ్రతికే ఉందని తెలిసి ఆ నిధులతో షెడ్ నిర్మింపజేస్తున్నాం. ఒక రామాలయానికి రావలసిన నిధులను రాజకీయం కోసం అడ్డుకోవడం సనాతన ధర్మమా అని అడుగుతున్నా

మహేంద్రవాడ శివాలయం నిర్మాణంలో గ్రామంలోని రెండు రాజకీయపక్షాలను నేను పిలిచి ఆలయాల విషయంలో రాజకీయాలు తగదు అని చెప్పి రెండు పక్షాలను ఏకం చేసి ఆలయ నిర్మాణాలను పూర్తి చేసాం. శంకుస్ధాపనకు, విగ్రహ ప్రతిష్ఠ కు మిమ్మల్ని ఆహ్వానిస్తామని వైయస్సార్ సిపి నాయకులు కోరితే నేను మరో ఆలోచనకు తావు లేకుండా మిమ్మల్ని ఆహ్వానించి గౌరవిస్తే ఆ తర్వాత మీరు చేసిందేమిటి? శిల్పి కొమరిపాలెం వాస్తవ్యులు కొల్లి రాఘవ కి రావలసిన రూ.33 లక్షల రూపాయిలు సొమ్ము రాకుండా చేసి వారి మనోవేధనకు మీరు కారకులయ్యారు. పక్షవాతంతో ఆయన మంచాన పడేట్లు చేసారు. ఇది సనాతన ధర్మమా అని అడుగుతున్నా?

గొల్లల మామిడాడ పాటి మీద శివాలయం విరాళాలు మీ నాయకుడి దగ్గర ఉన్నాయి ఎందుకు లెక్కలు చెప్పనీయడం లేదు అలాగే గోగులమ్మ తల్లి విరాళాలు ఎందుకు లెక్క చెప్పడం లేదు?

హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడే వారికి తప్పుడు సమాచారం చెప్పి ఇక్కడ శివయ్యకు అపచారం జరుగుతుందంటూ ప్రచారం చేయడం అత్యంత దారుణం,

అనపర్తి ఆంజనేయనగర్ లో మీ బావమరిదికి లాభం చేకూర్చడం కోసం మీరు చేసిన పని వల్ల కర్రి అరుణకుమారి ఆత్మహత్య చేసుకుని సూసైడ్ నోట్ లో మీ కారణం చేత కార్తీకమాసంలో శివుని దర్శనం చేసుకోలేకపోయాను అని వ్రాసిన మాట వాస్తవం కాదా? ఆ కాలనీ వాసులకు శివాలయానికి వెళ్ళే దారి లేకుండా చేసిన మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడతారా!

తెలుగుదేశం పార్టీ వ్యక్తులు విగ్రహాలు ఇచ్చారనే అక్కసుతో చినపొలమూరులో శాస్త్రోక్తంగా పూజలు జరిగి రెండు నెలలు ధాన్యాగారంలో ఉంచిన విగ్రహాలను ప్రక్కనబెట్టేసి ఎటువంటి పూజలు జరుగని విగ్రహాలను తెచ్చి మీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మాట నిజం కాదా? ఇది సనాతన ధర్మమా?
కుతుకులూరు, కూటేశ్వరస్వామి ఆలయ శంకుస్ధాపనలో మీతో పాటు వేరే దంపతులు కూర్చున్నారన్న అక్కసులో మీ శ్రీమతి ప్రదర్శించిన అహంకార ధోరణి మరచిపోయారా?

ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు ఈరోజు నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన ఒక ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని వాయిదా వేయమని కోరితే దాన్ని రాజకీయం చేస్తారా? ప్రభుత్వ లేదా ప్రైనేటు లేఔట్లలో ఇతర నిర్మాణాలు చేయకూడదని సాక్షాత్తు ఉన్నత న్యాయస్ధానం ఇచ్చిన రూల్. ఆ రూల్ కి విరుద్దంగా నిర్మించిన ఆలయానికి పర్మిషన్లు పెట్టుకుని అనుమతులు వచ్చిన తర్వాత కార్యక్రమం చేసుకుందాం అని అధికారులు సూచించడం జరిగింది దానిని వక్రీకరించి ఇక్కడ బిజెపి మనిషినని చెప్పుకుని దుర్మార్గాలు చేసే ఓవ్యక్తి సూర్యనారాయణరెడ్డి వెనుక ఉండి కధ నడిపించడం జరిగింది.

ధర్మరక్షణ సమితి సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. దయ ఉంచి ఈ ప్రాంతానికి ప్రత్యక్షంగా వచ్చి జరిగిన సంగతులు అన్నీ విచారించిన తర్వాత స్పందించండి

అనపర్తి కొత్తూరు కాలనీలో జరిగిన అక్రమాలు ఎవరికైనా తెలుసా. పునాదులలో మట్టి పిల్లింగ్ పేరుతో ఒక్కొక్క లబ్దిదారుని నుండి పదివేలు వసూలు చేసారు. ఎవరైతే ఆలయ నిర్మాణానికి రూ 20 లక్షలు సొంత నిధులు ఖర్చుచేసామని చెపుతున్నారో ఆవ్యక్తులు కాలనీలో లబ్దిదారుల పట్టాలు చేతిలో పెట్టుకుని అప్పులిచ్చి రూ 5, రూ 10 వడ్డీ వసూలు చేస్తూ జలగలగా పేదల రక్తం త్రాగుతున్నారు. వీరి కుటుంబ భూకబ్జాలకు పెట్టింది పేరు. ఒక మానసిక వికలాంగుడి కుటుంబాన్ని వేధించి ఆయన భార్యను ట్రాప్ చేసిన మనుషులు వీళ్ళు. ట్రాప్ చేసి 12 కోట్ల ఆస్తిని 80 లక్షలకు వ్రాయించుకున్నారు,
ఇంకా గ్రామంలో అనేకమందిని ఇబ్బందులు పెట్టి ఆస్తులు వ్రాయించుకున్నారు మీడియాతో మాట్లాడలేని అనేక పనులు చేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేసారు. ఇటువంటి వ్యక్తులా సనాతన ధర్మం గురించి మాట్లాడేది,
ఒక్క కొత్తూరు స్ధలాలలో రూ మూడు నుండి 4 కోట్ల అవినీతి జరిగింది.

తప్పుడు సమాచారం ప్రచారం చేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీని అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం జరిగింది. దీన్ని ఎంత మాత్రమూ సహించేది లేదన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Nallamilli