Do the District Collectorate dharnanujyapradam on 30th of this month
సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (SCKS) ఆధ్వర్యంలో
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అర్జీ-1లోని శివాజీ నగర్, గాంధీ నగర్,ఉదయ్ నగర్ జోన్లలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.
ఈసందర్భంగా వేల్పుల కుమారస్వామి ఎస్.సి.కే.ఎస్.రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 30 వ తేదీన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ తప్పకుండా పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.
సింగరేణిలో పనిచేస్తున్న వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పనికి తగ్గ వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
వేతనాలు పెంచుతామని, హై పవర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్న ఇంకా వేతనాలు పెంచలేదని అన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన 22 జీ.ఓ. ను గెజిట్ చేసి సింగరేణిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2022 లో జరిగిన 18 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వంకు సింగరేణి లేఖ రాసిందని దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కార్మికుల కుటుంబ సభ్యులందరికీ వైద్య సదుపాయం కల్పించాలని అన్నారు. సింగరేణి లాభాల్లో అన్ని సెక్షన్ల కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 5000 రూపాయలు ఇవ్వాలని అన్నారు.
అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి డిమాండ్ చేశారు. ఇంకా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 30న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజు,రాజేశ్వరి,వసంత,చిలకమ్మ,ప్రసాద్,కాళీ, గోవింద్, రమేష్, జయ లక్ష్మీ,సాయి, శేకర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App