TRINETHRAM NEWS

లీగల్ సర్వీస్ డే సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో ఉచిత వైద్య శిబిరం, హెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించిన డి ఎం అండ్ హెచ్ ఓ లు.

హనుమకొండ జిల్లా
09 నవంబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వరంగల్, హనుమకొండ జిల్లాలు సంయుక్తంగా లీగల్ సర్వీస్ డే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ హనుమకొండ లో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి అనుబంధంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం, హెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగినది

హెల్త్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర జిల్లా ప్రధాన న్యాయమూర్తులు వివిధ శాఖల అధికారులు ప్రజలు సందర్శించిన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వరంగల్ జిల్లా డాక్టర్ .బీ. సాంబశివరావు, హనుమకొండ జిల్లా డాక్టర్ అప్పయ్య వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సేవలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలు వివరించడం జరిగినది. వరంగల్ హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్.బీ.సాంబశివరావు, హనుమకొండ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.అల్లం అప్పయ్య వారిద్దరూ మాట్లాడుతూ… జాతీయ ఆరోగ్య మిషిన్ లో ప్రోగ్రామ్స్ను 100% అచీవ్మెంట్ చేస్తున్నామనీ, ప్రతి ప్రోగ్రాం ని మేము ఈరోజు డిస్ప్లే రూపంలో అక్కడికి వచ్చిన వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రాంలో ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం గవర్నమెంట్ ఉచిత వైద్య శిబిరాలు ప్రతి నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించాలని వైద్యాధికారులకు తెలియజేయడం జరిగింది. సీజనల్ వ్యాధులు వచ్చే రకాల వ్యాధుల గురించి ముందుగా దోమల తెరలను దోమలు కుట్టకుండా వాడాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా కలుషిత ఆహారం కలగకుండా, వేడి ఆహారం తీసుకోవాలని ఇలాంటి సూచనలు సలహాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేశారు ..ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మోహన్ సింగ్, పల్లె దావఖన వైద్యాధికారులు డాక్టర్లు రమ్య, డాక్టర్.నరేష్ కుమార్ , హనుమకొండ జిల్లా డెమో అశోక్ రెడ్డి , వరంగల్ జిల్లా డిప్యూటీ డెమో అనిల్ కుమార్, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, హెల్త్ సూపర్వైజర్లు శ్రీనివాస్, అనిల్ కుమార్, గోవర్ధన్, ఫార్మసిస్ట్ అంజయ్య,ఏఎన్ఎంలు , ఎం.ఎన్.ఓ.ఏ.విజయ్ నాయక్, కాంటిజెంట్ వర్కర్ సాంబయ్య, ఆరోగ్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App