TRINETHRAM NEWS

జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించిన డి.ఎం.అండ్ హెచ్.ఓ డాక్టర్.బి.సాంబశివరావు

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
02 డిసెంబర్ 2024

దేశాయిపేట లోని ఎమ్.హెచ్.నగర్ లో జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని డి ఎం హెచ్ ఓ డాక్టర్. బీ.సాంబశివరావు సోమవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టి వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి ఏం. డి.టి.చికిత్సను వాడితే వ్యాధిని దానివల్ల కలిగే అంగవైకాలను నివారించవచ్చునని తెలిపారు. శరీరం పై తెల్లని ఎర్రని రాగి రంగు మచ్చలు ఆ మచ్చలపై స్పర్శ లేకుండా మొద్దుబారి ఉండడం వల్ల కుష్టి వ్యాధికి భావించి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యాధికారిని సంప్రదించి సరియైన చికిత్స మందులను వాడాలని పేర్కొన్నారు కుష్టి వ్యాధి పెద్ద రోగం కాదని అని రోగాల వల్లే ఇది ఒకటే అని పాపాల వల్ల దేవుడు శాపం వల్ల రాదని కుష్టి వ్యాధి లెఫ్రి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు.
కుష్టి వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వ సహాయంగా 8000 ఇవ్వబడుతుందని పేర్కొన్నారు, కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు గాంధీజీ కలలుగన్న కుష్ఠరాహిత సమాజ స్థాపనలో మనమంతా కృషి చేయాలని, కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. మోహన్ సింగ్ ,జిల్లా ఫిజియోథెరపిస్టు నరసింహారెడ్డి ,మెడికల్ ఆఫీసర్ డాక్టర్.టి. భరత్ కుమార్ ,డి.పి.ఎమ్.ఓ అనుపమ ,సూపర్వైజర్ జన్ను కొర్నేలు , ఎం.ఎన్.ఓ. కుమారస్వామి, ఏఎన్ఎంలు మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App