TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ M. ప్రశాంత్ వర్ధన్, SI టాస్క్ ఫోర్స్. జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం మేరకు మోమిన్ పేట్ మరియి నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్స్ పరిధిలలో అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్నా మూడు ట్రాక్టర్ లు, మూడు టిప్పర్ లారీలు మరియు ఎర్రమట్టిని త్రావ్వుతున్న రెండు జేసీబీ లను సిజ్ చేసి ఆయా పోలీస్ స్టేషన్స్ లలో కేసులు నమోదు చెయ్యడం జరిగింది అని టాస్క్ ఫోర్స్ SI ప్రశాంత్ వర్ధన్ తెలియజేయడం జరిగింది. అట్టి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరం పల్లి గ్రామ శివారులో అక్రమంగా ఎర్ర మట్టి తరలిస్తున్నారు అనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి ఎర్ర మట్టి తరలిస్తున్నా మూడు ట్రాక్టర్ లు , ఒక జేసీబీ ని సిజ్ చేసి మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్కతల గ్రామ శివారులో అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్నారు అనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి మూడు ఎర్రమట్టి తరలిస్తున్నా టిప్పర్ లారీలను, ఒక జేసీబీ ని సిజ్ చేసి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది అని టాస్క్ ఫోర్స్ SI తెలిపినారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Task Force officers raids