రేపు జరుగబోయే గణతంత్ర దినోత్సవo సందర్బంగా పరెడ్ రిహార్సల్స్, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు IPS
Trinethram News : రేపు జరగబోయే గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పరేడ్ రిహార్సల్స్ ను, ఏర్పాట్లను, జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు,IPS పరిశీలించారు.
ఈ సందర్బంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా వేడుకలకు వచ్చే అధికారులకు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సాయుధ దళ డి.ఎస్పి కి సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ కమాండర్ గా ఆర్ ఐ వెంకటేష్ వ్యవహరించనున్నారు.
ఈ కార్యక్రమంలో సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు, ఆర్. ఐ లు వెంకటేష్, హరీఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App